నైజాం లో ఎఫ్ 2 ,వివిఆర్ వసూళ్ల వివరాలు !

Published on Jan 13, 2019 9:43 am IST


విక్టరీ వెంకటేష్ ,వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ ఎఫ్ 2 నిన్న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ఈ చిత్రం నైజాం లో మొదటి రోజు 1.73కోట్ల షేర్ ను రాబట్టింది. ఈచిత్రం అక్కడ 9కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈరోజునుండి పండుగ సెలవులు కావడంతో ఈ చిత్రానికి కలెక్షన్ల పరంగా ఎటువంటి డోకా ఉండదు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో తమన్నా , మెహ్రీన్ కథానాయికలుగా నటించారు. ఇక ఇటీవల వరస పరాజయాలతో డీలా పడ్డ దిల్ రాజు ‘ హలో గురు ప్రేమ కోసమే , ఎఫ్ 2’ చిత్రాలతో మళ్ళీ సక్సెస్ బాట పట్టారు.

ఇకఇదిలావుంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ కలెక్షన్లు రెండవ రోజు నైజాం లో భారీ గా డ్రాప్ అయ్యాయి. మొదటి రోజు 5కోట్ల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు 1.61 కోట్ల షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ ఈ సినిమా కలెక్షన్ల ఫై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More