మహానటి దర్శకుడితో వైజయంతి భారీ ప్రాజెక్ట్…!

Published on Aug 7, 2019 1:00 pm IST

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ వైజయంతీ మూవీస్ మహానటి దర్శకుడితో ఓ భారీ చిత్రం మొదలుపెట్టనున్నారా? అందుకే నాగ్ అశ్విన్ మహానటి చిత్రం తరువాత ఇన్నాళ్ల విరామం తీసుకున్నాడా? తాజా పరిణామాలు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం వైజయంతి మూవీస్ తన అధికారిక ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేసి వార్తలలో నిలిచింది.

తాము వచ్చేనెలలో మొదలుపెట్టనున్న భారీ చిత్రంలో పనిచేయుటకు విజువల్ ఆర్టిస్ట్స్,డిజైనర్స్, మరియు రైటర్స్ కావాలంటూ ప్రకటించారు. వారు అడిగిన సాంకేతిక నిపుణులను పరిశీలించినట్లైతే ఇది అడ్వెంచర్స్ తో కూడిన భారీ పీరియాడిక్ మూవీ అని అర్థం అవుతుంది. ఐతే కేవలం ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్నారని స్పష్టం చేసిన చిత్ర యూనిట్,నటీనటులు,సాంకేతిక నిపుణుల వివరాలు మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. త్వరలో పూర్తివివరాలు వెల్లడించే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :