సెన్సేషనల్ హీరో తో వైజయంతి రెండు సినిమాలను ప్లాన్ చేసింది !

సెన్సేషనల్ హీరో తో వైజయంతి రెండు సినిమాలను ప్లాన్ చేసింది !

Published on Sep 18, 2018 4:47 PM IST

‘మహానటి’ చిత్రంతో మళ్ళీ పునర్వైభవాన్ని తెచ్చుకుంది ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. ఈచిత్రం ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలను నిర్మించనున్నారు వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్.

దాంట్లో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక చిత్రాన్ని అలాగే యువ హీరో విజయ్ దేవరకొండతో రెండు సినిమాలు చేయడానికి ఒప్పొందం కుదర్చుకుంది.అంతే కాకుండా ఈ సంస్థ తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను నిర్మించనుంది.

ఇక వైజయంతి మూవీస్ ప్రస్తుతం నాగార్జున , నాని కలయికలో శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘దేవదాస్’ అనే చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈచిత్రం ఈనెల 27న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు