మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ టీమ్ సెలబ్రేషన్స్…దేనికంటే …?

మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ టీమ్ సెలబ్రేషన్స్…దేనికంటే …?

Published on Dec 21, 2022 12:58 AM IST


మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ వాల్తేరు వీరయ్య. కొంత గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి మంచి మాస్ రోల్ చేస్తున్న ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన బాస్ పార్టీ సాంగ్ అలానే శ్రీదేవి చిరంజీవి సాంగ్ రెండూ కూడా మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ ని సొంతం చేసుకుని మూవీ పై భారీగా అంచనాలు క్రియేట్ చేసాయి. కాగా ఈ రెండు సాంగ్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుండంతో కొద్దిసేపటి క్రితం డైరెక్టర్ బాబీ, కోన వెంకట్, డాన్స్ మాస్టర్ శేఖర్ తదితరులు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. తప్పకుండా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న వాల్తేరు వీరయ్య అందరి అంచనాలు అందుకుని మంచి విజయం అందుకుంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు