పవర్ఫుల్ బీట్ తో అదరగొట్టిన ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్

పవర్ఫుల్ బీట్ తో అదరగొట్టిన ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్

Published on Dec 26, 2022 8:52 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మాస్ యాక్షన్ మూవీ వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీని యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి నుండి అటు మెగా ఫ్యాన్స్ తో పాటు ఇటు నార్మల్ ఆడియన్స్ లో కూడా వాల్తేరు వీరయ్య పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలవగా నేడు కొద్దిసేపటి క్రితం వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు మేకర్స్. హీరో క్యారెక్టర్ ని తెల్పుతూ అద్భుతంగా ఎలివేట్ చేస్తూ చంద్రబోస్ రాసిన ఈ సాంగ్ ని దేవిశ్రీప్రసాద్, అనురాగ్ కులకర్ణి సూపర్ గా పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళుతోంది. కాగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు