“బాహుబలి” వెబ్ సిరీస్ లో శివగామి పాత్ర చేసేది ఎవరంటే?

Published on Jul 2, 2021 11:37 pm IST


బాహుబలి సిరీస్ చిత్రాలతో తెలుగు సినిమాను ప్రపంచ నలుమూలలకు పరిచయం చేశారు రాజమౌళి. అయితే ఈ సినిమాలు భారీ విజయాలు సాధించడం తో వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. అయితే ఈ వెబ్ సిరీస్ బాహుబలి బిగినింగ్ కి ముందుగా ఏం జరిగింది అనే దాని పై ఉండనుంది. అయితే ఈ సీరీస్ కోసం దర్శక నిర్మాతలు చాలా కసరత్తులు చేస్తున్నారు. భారీ విజయం సాధించిన ఈ చిత్రాల కి ఏ మాత్రం తీసిపోకుండా నటీనటులను ఎంచుకుంటున్నారు. అయితే ఈ బాహుబలి సిరీస్ లో శివగామి పాత్ర చాలా పవర్ ఫుల్ అని చెప్పాలి. ఈ పాత్ర కోసం వామికా గబ్బి ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే వామిక గబ్బీ ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, పంజాబీ చిత్రాల్లో నటించింది. అయితే ఇప్పుడు ఈ శివగామి పాత్ర తో మరింత క్రేజ్ సొంతం చేసుకొనే అవకాశం వచ్చింది అని చెప్పాలి. అయితే రాజమౌళి, ప్రసాద్ దేవినేని నిర్మాతలు గా వ్యవహరిస్తున్న ఈ వెబ్ సిరీస్ కి దేవకట్టా, ప్రవీణ్ సత్తారు లు దర్శకులు గా వ్యవహరిస్తున్నారు. అయితే భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానుంది.

సంబంధిత సమాచారం :