అక్కడ సైరా పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ వార్ పరిస్థితి అలాగే ఉంది

అక్కడ సైరా పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ వార్ పరిస్థితి అలాగే ఉంది

Published on Oct 6, 2019 6:18 PM IST

గాంధీ జయంతి సంధర్బంగా దేశవ్యాప్తంగా రెండు బడా చిత్రాలు బరిలో దిగాయి. వాటిలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మూవీ కాగా రెండవది హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ల మల్టీస్టారర్ వార్. ఈ రెండు చిత్రాలు పలు భాషలలో విడుదల కావడం జరిగింది. ఐదు భాషలలో విడుదలైన సైరా తెలుగులో మరియు సౌత్ లాంగ్వేజ్ లలో మంచి ఆదరణ దక్కించుకోగా హిందీలో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. కారణాలేమైనా కానీ సైరా హిందీ వర్షన్ కి అత్యంత తక్కువ ఓపెనింగ్స్ రావడం జరిగింది.

ఇక హిందీతో పాటు తెలుగు మరియు తమిళ భాషలలో విడుదలైన వార్ చిత్ర పరిస్థితి కూడా ఇలానే ఉండటం గమనార్హం. మొదటిరోజే 52కోట్ల కలెక్షన్స్ తో ఆల్ టైం హైయెస్ట్ ఫస్ట్ డే గ్రాస్సర్ లో ఒకటిగా నిలిచిన వార్ మూవీ నాలుగు రోజులలో 123.60 కోట్ల కలెక్షన్స్ తో దుమ్ముదులిపింది. కానీ సౌత్లో వార్ వసూళ్లు చాలా తక్కువగా ఉండటం గమనార్హం. నాలుగు రోజులకు గాను, వార్ తెలుగు తమిళ భాషలలో కలిపి కేవలం 5.25 కోట్ల వసూళ్లు రాబట్టగలిగింది. దీనితో సైరా కు నార్త్ లో ఎదురైన పరిస్థితే వార్ కు సౌత్ లో ఎదురైందని అందరూ అనుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు