కేవలం వారంలో 200కోట్లు కొల్లగొట్టారు

Published on Oct 9, 2019 6:06 pm IST

హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్టైనర్ వార్ మూవీ 200 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. అక్టోబర్ 2న విడుదలైన వార్ మూవీ కేవలం ఏడురోజులలో ఈ మార్కు చేరుకుంది. విడుదలైన మొదటి రోజే 50కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం సల్మాన్‌ ఖాన్‌ తాజా చిత్రం భారత్‌ లైఫ్‌టైమ్‌ బిజినెస్‌ను అధిగమించింది. దసరా సెలవులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్న వార్, సాలిడ్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఈ మూవీ లైఫ్ టైం వసూళ్లు ముగిసే నాటికి, 300కోట్ల రూపాయల వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.

తొలివారంలో వార్‌ మూవీ రూ. 208 కోట్లు రాబట్టిందని, తమిళ్‌, తెలుగు వెర్షన్‌లను కలుపుకుని దేశవ్యాప్తంగా రూ. 215 కోట్లు కలెక్ట్‌ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని సమాచారం. 200 కోట్ల వసూళ్లు దాటిన వార్‌ కలెక్షన్లు ఇంకా నిలకడగా ఉండటంతో ముందుముందు సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందని భావిస్తున్నారు. యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీకి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా, వాణి కపూర్ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం :

X
More