బన్నీ వద్దన్నా, సుకుమార్ ఆయన్ని వదల్లేదట?

Published on Feb 10, 2020 9:55 am IST

ఒక్కొక్క దర్శకుడికి ఒక్కొక్క టెక్నీషియన్ తో గురి కుదురుతుంది. వారితో బెస్ట్ అవుట్ ఫుట్ వారు రాబట్ట గలుగుతారు. అలాంటి వారిలో సుకుమార్ దేవిశ్రీ ఒక బెస్ట్ కాంబో అని చెప్పవచ్చు. సుకుమార్ కెరీర్ ప్రారంభం నుండి దేవిశ్రీ ఆస్థాన సంగీత దర్శకుడు అయ్యారు. ఇప్పటివరకు సుకుమార్ తీసిన ప్రతి సినిమాకు దేవిశ్రీ సంగీతం అందించడం జరిగింది. సుకుమార్ సినిమాలకు దేవిశ్రీ బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు. ఆర్య చిత్రం నుండి రామ్ చరణ్ రంగస్థలం చిత్రం వరకు సుకుమార్ సినిమాలు ఫెయిల్ అయినా, దేవిశ్రీ సంగీతం నిరాశ పరిచిందిలేదు.

సుకుమార్ బన్నీ 20వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కూడా ఎప్పటిలాగే దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. గత కొన్ని సినిమాలకు దేవిశ్రీ అందించిన సంగీతంతో సంతృప్తి చెందని బన్నీ, దేవిశ్రీ కాకుండా తమన్ తీసుకోవడం బెటర్ అని సూచించారట. అలాగే అల వైకుంఠపురంలో చిత్ర విజయంలో థమన్ సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. ఈనేపథ్యంలో థమన్ వైపే బన్నీ మొగ్గు చూపగా సుకుమార్ సున్నితంగా తిరస్కరించి, దేవిశ్రీ బెస్ట్ సాంగ్స్ ఇస్తాడని కన్విన్స్ చేశాడట. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రష్మిక మందాన బన్నీ సరసన నటిస్తుంది.

సంబంధిత సమాచారం :