రాజకీయాల్లోకి ‘ఎన్టీఆర్’ రాక కోసం ఎదురుచూస్తున్నాం !

Published on Mar 24, 2019 1:25 am IST

మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. సామాజిక అంశాల పై అలాగే నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఇక మనోజ్ జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మంచి మిత్రులు అన్న సంగతి తెలిసిందే. పైగా ఇద్దరీ బర్త్ డే కూడా ఒకే రోజు.

కాగా తాజాగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రచడం పై మనోజ్ ఆసక్తి కరమైన కామెంట్ చేశాడు. రీసెంట్ గా జూ ఎన్టీఆర్ అభిమాని మనోజ్ కి ట్వీట్ చేస్తూ ‘అన్న చిన్న డౌట్, ఇప్పుడు ఏ పార్టీకి అయినా సపోర్ట్ చేయన్న, అది నీ ఇష్టం. కానీ, ఓ 5/10 సంవత్సరాల తరవాత తారక్ అన్న రాజకీయాల్లోకి వస్తే ఆయనకు తోడుగా ఉంటావా అన్న’ అని ప్రశ్నించాడు.

అతను అడిగిన ప్రశ్నకు మంచు మనోజ్ బదులిస్తూ.. ‘తారక్ వస్తే ఇక నేను ఎటు వెళ్తాను తమ్ముడు?! నా మిత్రుడి రాక కోసం ఎదురుచూస్తున్నాం. తారక్ ప్రాణానికి నా ప్రాణం అడ్డు’ అని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ ను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More