‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’తో యామిని వచ్చేసింది !

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’తో యామిని వచ్చేసింది !

Published on Dec 15, 2019 6:18 PM IST

world

క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ జీవితంలోని నాలుగు దశల్లో నలుగురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. ఇప్పటికే విజయ్‌ భార్యగా, తెలంగాణ అమ్మాయి సువర్ణగా ఐశ్వర్యా రాజేష్‌.. ఫ్రెంచ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఇజా పాత్రలో నటిస్తోన్న ఇజా బెల్లె లియెతె అండ్ క్యాథరిన్‌ థ్రెసా లుక్స్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. కాగా తాజాగా విజయ్ దేవరకొండను కౌలిగించుకుంటున్న రాశి ఖన్నా లుక్ ను విడుదల చేస్తూ.. యామిని అండ్ గౌతమ్ కి స్వాగతం అని పోస్ట్ చేసింది చిత్రబృందం.

కాగా జనవరి 3న ఈ సినిమా టీజర్‌ విడుదలవుతుంది. ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు సమర్పణలో కియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. గోపీసుందర్‌ మ్యూజిక్‌, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు