‘వకీల్ సాబ్-2’.. పాజిబులిటీ ఎంత ?

Published on May 7, 2021 7:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడంలో కాస్త వెనుకబడింది. టికెట్ ధరలు తగ్గించడం, కోవిడ్ కేసులు ఎక్కువ కావడం, సినిమా కనీసం నెల రోజులు కూడ థియేటర్లలో నడిచే పరిస్థితులు లేకపోవడంతో పవన్ స్థాయి వసూళ్లు రాలేదు. సినిమాకు వచ్చిన హిట్ టాక్ కు నార్మల్ సిట్యుయేషన్ గనుక ఉండి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. ఈ సంగతి అటుంచితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన శ్రీరామ్ వేణు మదిలో మొదలైంది.

సినిమా పట్ల పూర్తిగా సంతృప్తి చెందిన పవన్ ఫ్యాన్స్ వేరో కొత్త సామాజిక అంశాన్ని బేస్ చేసుకుని ‘వకీల్ సాబ్-2’ తీయవచ్చు కదా అంటూ శ్రీరామ్ వేణును అడగటంతో ఆయన కూడ సానుకూలంగా స్పందించి మంచి కథతో పవన్ వద్దకు వెళ్తానని అన్నారు. వేణు శ్రీరామ్ సీక్వెల్ చేయాలని డిసైడ్ కావడం బాగానే ఉన్నా అసలు పవన్ వద్ద సీక్వెల్ చేసే టైమ్ ఉందా అనేదే పెద్ద ప్రశ్న.

పవన్ ఇప్పుడిప్పుడే కోవిడ్ నుండి కోలుకుంటున్నారు. ఆయన సెట్స్ మీదకు రావడానికి ఇంకో నెలన్నర టైమ్ పడుతుంది. ఆయన సైన్ చేసిన సినిమాలన్నీ ఇంకో రెండు నెలలు వెనక్కి వెళ్ళినట్టే. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్, ‘హరి హర వీరమల్లు’ సినిమాలు మధ్యలో ఉన్నాయి. అవి పూర్తి కావాలంటే సెప్టెంబర్ అయ్యేలా ఉంది. వాటి తర్వాత హరీష్ శంకర్ సినిమా. ఆ సినిమా ఏడాది చివరకు కంప్లీట్ అవుతుంది. వాటి తర్వాత ఇంకో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. సో.. ఇవన్నీ కంప్లీట్ కావాలంటే వచ్చే ఏడాది సరిపోతుంది. మరి పవన్ ఈ బిజీ షెడ్యూల్ నడుమ సీక్వెల్ అంటే ఒప్పుకుంటారో లేదో.

సంబంధిత సమాచారం :