ఆ బయోపిక్ కి బాలయ్య నో చెప్పాడు ?

Published on Mar 31, 2020 3:00 am IST

మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ లో బాలయ్య బాబు ఎన్టీఆర్ లా నటించి బాగానే అలరించారు. కానీ ఆ బయోపిక్ రిజల్ట్ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశ పరిచింది. దాంతో బాలయ్య బాబు చాల ఫీల్ అయినట్లు ఉన్నారు. మళ్లీ ఎన్టీఆర్ పాత్రలో నటించాలని రిక్వెస్ట్ చేసినా బాలయ్య మాత్రం నటించడానికి అంగీకరించలేదట. దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్న ఈ బయోపిక్ లో మొదట ఎన్టీఆర్ పాత్ర కూడా ఉందట.

కాగా ఎన్టీఆర్ పాత్రలో నటించడానికి బాలయ్యనే ఒప్పించాలని మేకర్స్ భావించారు. ఎందుకంటే, ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో విష్ణు ఇందూరి కూడా ఒకరు. ఇప్పుడు ఆయన నిర్మిస్తోన్న అమ్మ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్ర ఉండటం, ఆ పాత్రలో బాలయ్య అయితేనే ఆ పాత్రకు నిండుతనం వస్తోందనే ఉద్దేశ్యంతో విష్ణు ఇందూరి, బాలయ్యను నటించమని కోరినా.. బాలయ్య సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దాంతో చేసేది ఏమి లేక ఎన్టీఆర్ పాత్రను సినిమాలో నుండి తొలిగించినట్లు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ పాత్రను నిజంగానే తొలిగించారా లేక వేరే ఎవరి చేతనైన నటింపజేశారా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More