బాలయ్య బాబు ఒక్కడికే ఏమైంది ?

Published on Apr 8, 2020 2:54 pm IST

బాలయ్య బాబు సినిమాలు అంటే, ఒకప్పుడు ఫ్యాన్స్ హడావుడి ఓ రేంజ్ లో ఉండేది. అయితే ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద బాలయ్య సినిమాల పరిస్థితి తెలిసిందే. ఇలాంటి టైంలో కూడా బాలయ్య తన పోకడను మార్చుకోవట్లేదని బాలయ్య ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఈ డిజిటల్ జనరేషన్ లో తోటి హీరోలంతా చిరంజీవి, మోహన్ బాబు, నాగ్, వెంకీ.. చివరికీ రాజశేఖర్ కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ తో అభిమానులను ఉత్తేజపరుస్తుంటే.. బాలయ్య ఒక్కడే సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నాడు. దీంతో ‘బాలయ్య ఫ్యాన్స్’ ఫ్యాన్స్ గ్రూప్ పేజిస్ లో బాలయ్య ఒక్కడికే ఏమైంది.. సోషల్ మీడియాలోకి రావొచ్చు కదా.. అని కామెంట్స్ చేస్తూ తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారట.

ఇక నుండైనా బాలయ్య మారాలని, సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే తన సినిమాల విషయంలో కూడా.. క్రేజ్ తెచ్చే కాంబినేషన్స్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని.. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రేక్షుకులను దృష్టిలో పెట్టుకుని బాలయ్య తదుపరి సినిమాలను.. ఓన్లీ ఫామ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ తోనే ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రొటీన్ యాక్షన్ స్టోరీలతో కాకుండా వైవిధ్యమైన కథలను తీసుకుని సెన్స్ బుల్ డైరెక్టర్స్ డైరెక్షన్ లో సినిమా చేస్తే.. బాలయ్య సినిమా వంద కోట్లు కల కూడా నేరవేరుతుందని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు.

ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ‘సింహ, లెజెండ్’ సినిమాల మాదిరిగాన ఈ సినిమాలో కూడా మాస్ అండ్ యాక్షన్ తో పాటు బాలయ్యను కొత్తగా చూపిస్తున్నాడట బోయపాటి. మరి బాలయ్య బాబు కొత్తదనం ఏ రేంజ్ లో ఉంటుందో.

సంబంధిత సమాచారం :

X
More