బాలయ్య కొత్త అవతారం వెనుక అసలు రీజన్ అదేనా..?

Published on Jan 20, 2020 6:54 am IST

బాలయ్య నయా లుక్ ఆయన అభిమానులతో పాటు సగటు సినీ ప్రేమికులలో ఆసక్తి పెంచింది. ఎన్నడూ కనిపించని కొత్త లుక్ లో ఆయన దర్శనమిచ్చారు. వైట్ అండ్ వైట్ లో విగ్గు లేకుండా తెల్లని గడ్డంలో ఉన్న బాలయ్య లుక్ ఆకట్టుకుంటుంది. ఐతే ఈ లుక్ వెనుక ఆంతర్యం ఏమిటనేది అర్థం కాలేదు. బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూవీ చేయనున్నారన్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

కాగా ఈ లేటెస్ట్ లుక్ బోయపాటి సినిమా కోసమా… అనిపిస్తుంది. అభిమానుల నుండి వచ్చే స్పందన తెలుసుకోవడానికి ఇలా ఆయన లుక్ బయటకు విడుదల చేశారా అనే అనుమానం కూడా కలుగుతుంది.లేక షూటింగ్ షెడ్యూల్ గ్యాప్ లో బాలయ్య ఇలా క్యాజువల్ లుక్ లో కనిపించారా అనేది తెలియాలి. ఐతే ఆ లుక్ చూసిన ఎవరికైనా బాలయ్య ఆ గెటప్ లో ఓ మూవీ చేస్తే బాగుండు అనే అభిప్రాయం కలుగుతుంది.

సంబంధిత సమాచారం :

X
More