‘పుష్ప’లో రష్మిక పాత్ర అదే ?

Published on Apr 17, 2021 6:11 pm IST

అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది ‘రష్మిక మండన్నా’. లక్కీ లేడీగా ముద్ర వేసుకున్న రష్మిక భారీ ఆఫర్స్ దక్కించుకోవడంతో పాటు వరుస విజయాలు అందుకుంటుంది. గత ఏడాది రష్మిక నటించిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్పలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమాలో రష్మిక పాత్ర పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది.

అసలు ‘పుష్ప’ సినిమాలో ‘రష్మిక మండన్నా’ది ఎలాంటి క్యారెక్టర్ ? ఆమె ఎలా కనిపించబోతుంది ? అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కాగా ఈ సినిమాలో రష్మికది డీగ్లామర్ రోల్. ఆమె పాత్ర పల్లెటూరి పాత్ర. అయితే ఇంటర్వెల్ లో ఆమె పాత్ర పై ఒక ట్విస్ట్ రివీల్ అవుతుందట. ఆమె విలన్ తరుపున నుండి వచ్చిన ఎకౌంటెంట్ గా ఆమె రివీల్ అవుతుందట. ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :