రామ్ సినిమా పరిస్థతి ఏమిటి ?

Published on Oct 19, 2020 6:59 am IST

ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన సినిమాలు, కరోనా మహమ్మారి దెబ్బకు గందరగోళంలో పడ్డాయి. ఇప్పుడు దసరా సీజన్ కూడా మరో పది రోజుల్లో పోనుంది. కానీ మంచి అంచనాలు ఉన్న సినిమాల రిలీజ్ మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇక మధ్యలో చిన్న సినిమాలు చేసేది ఏమిలేక నేరుగా డిజిటల్ రిలీజ్ కి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే నాని ‘వి’, నిశబ్దం రిలీజ్ అయ్యాయి. సూర్య ‘ఆకాశమే హద్దుగా’, కలర్ ఫోటో లాంటి సినిమాలు రిలీజ్ కి రెడీ అయిపోయాయి. కానీ రామ్ ‘రెడ్’ మాత్రం ఇంకా క్లారిటీ లేకుండానే ఉంది.

మరోపక్క రామ్ తన సినిమాని నేరుగా థియేటర్ లోనే రిలీజ్ చేయటానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా పై మంచి హైప్ ఉంది. అందుకే ఈ సినిమా రిలీజ్ విషయంలో రామ్ పట్టు పట్టినట్లు ఉన్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలనుకున్నారు, కానీ కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. ఆ తరువాత ఎన్నీఆఫర్లు వచ్చినా ఓటిటీలో రిలీజ్ చేయము అని మేకర్స్ స్పష్టం చేశారు.

అయితే సంక్రాంతికి అన్ని కుదిరితే నేరుగా థియేటర్ లో రిలీజ్ చేయాలనేది రామ్ ప్లాన్. కానీ సంక్రాంతికైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందని నమ్మకంగా చెప్పలేని పరిస్థతి. మరి చివరకు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More