ఎన్టీఆర్ చిత్రం కోసం విద్యాబాలన్ చేసిన డిమాండ్ ఏంటంటే ?

Published on Jul 24, 2018 1:43 pm IST

క్రిష్ దర్శకత్వంలో, మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఎన్టీఆర్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 5 నుంచి ఈ చిత్ర షూటింగ్ మొదలయింది. కాగా ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్ ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.

ఐతే విద్యాబాలన్ ఈ చిత్రంలో నటించడానికి భారీ మొత్తంలో డిమాండ్ చేసిందనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నటించడానికి విద్యాబాలన్ రెండు కోట్లు అడిగారట. చిత్రబృందం బసవతారకంగారి పాత్రకు పూర్తి న్యాయం జరగలాంటే విద్యాబాలనే కరెక్ట్ అని ఆమె అడిగినంత ఇవ్వడానికి దర్శక నిర్మాతలు అంగీకరించారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :