వాల్మికీలో పూజా హెగ్డే రోల్ ఏమిటి?

Published on Aug 16, 2019 8:17 am IST

వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న వాల్మీకి చిత్ర టీజర్ నిన్న విడుదల చేయడం జరిగింది. వరుణ్ ఇంతకు ముందెన్నడూ చూడని ఊర మాస్ అవతారంలో కేకపుట్టించేలా ఉన్నాడు. బాగాపెరిగిన గడ్డం ఉంగరాల జుట్టు, మేడలో దండలు, నల్లని బట్టలలో వరుణ్ కరుడుగట్టిన రౌడీలా భయంకరంగా ఉన్నాడు. పాత్రకు తగ్గట్టు ఆయన నటన కూడా టీజర్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. అమిత ఆవేశం, అలాగే హాస్యం పండించే విలన్ గా వరుణ్ అలరించనున్నాడు.

వాల్మీకి చిత్రం తమిళ జిగర్తాండ చిత్రానికి తెలుగు రీమేక్ అన్నసంగతి తెలిసిందే. ఐతే ఆసక్తికర విషయం ఏమిటంటే తమిళ చిత్రంలో బాబీ సింహ చేసిన పాత్రను వరుణ్ చేస్తుండగా, హీరో సిద్దార్ద్ చేసిన ఫిలిం డైరెక్టర్ పాత్రను అధర్వ చేస్తున్నారు. అధర్వ లవర్ గా మృణాళిని రవి కనిపించనుంది. ఐతే మరి పూజా హెగ్డే పాత్రేమిటి అనేది ఆసక్తికర విషయం. ఎందుకంటే వరిజినల్ మూవీ జిగర్తాండలో బాబీ సింహ పాత్రకు హీరోయిన్ ఉండదు. మరి ఇక్కడ వరుణ్ హీరోగా చేస్తుండటంతో పూజా హెగ్డే ని తీసుకోవడం జరిగింది.

కథ ప్రకారం అదర్వకు మాత్రమే జోడి పాత్ర ఉంటుంది, ఆ పాత్రను మృణాళిని చేస్తున్నారు. మరి పూజా కోసం హరీష్ కొత్తగా పాత్ర ఏమైనా రాశాడా అనేది ఆసక్తికరం. వాల్మీకి మూవీ వచ్చే నెల 13న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :