నాగ్ బర్త్ డే స్పెషల్ ఏమిటీ?

Published on Aug 28, 2019 2:16 pm IST

కింగ్ నాగార్జున రేపు తన 60వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఆయన అక్కినేని వారసుడిగా తెరంగేట్రం చేసి కూడా దాదాపు 33 ఏళ్ళు గడుస్తుంది. 1986లో విడుదలైన విక్రమ్ చిత్రంతో ఆయన తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు. మరి రేపు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా కొత్త మూవీకి సంబంధించిన విషయమేదైనా పంచుకుంటారని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నాగార్జున నటించిన తాజా చిత్రం మన్మధుడు ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఆయన ఎప్పటినుండో సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సీక్వెల్ అయిన బంగార్రాజు చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుందని సమాచారం. మరి రేపు నాగ్ పుట్టిన రోజు కానుకగా ఈ చిత్రంపై ఏమైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :