సమంత – నందిని ప్రాజెక్ట్ ఏమవుతుంది?

Published on May 19, 2019 2:00 am IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒక్క గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా తనలో ఉన్న నటనా చాతుర్యానికి అద్దం పట్టేలా మంచి మంచి ప్రాజెక్టులను ఎంచుకుంటూ గత కొంత కాలం నుంచి మంచి సినిమాలను అందిస్తున్నారు.అయితే ఒక కొరియన్ చిత్రానికి రీమేక్ గా నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత “ఓ బేబీ” అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రంలో సామ్ ఒక వయసు మళ్ళిన లేడీ పాత్రలో కనిపించనున్నారు అని తెలియడంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు.

కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు పై సినీ వర్గాలలో కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాలూకా ఫుటేజ్ ఊహించిన స్థాయిలో రాకపోవడంతో మళ్ళీ రీషూట్ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.ఇది ఎంత వరకు నిజమో కానీ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.మరి ఈ వార్తపై నందిని అండ్ టీమ్ ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More