మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. మంచి బజ్ ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పుడు వరకు వచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యి కావాల్సినంత రీచ్ ని సొంతం చేసుకున్నాయి. ఇదంతా బాగానే ఉంది కానీ అసలు కంటెంట్ ఎప్పుడు వస్తుంది అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
పాటలు వరకు చూస్తే కాదు కనీసం టీజర్ వదిలితే అయినా అసలు సినిమా ఎలా ఉండబోతుంది? కంటెంట్ ఏంటి? చిరంజీవి లాంటి హీరోని పెట్టుకొని అనీల్ రావిపూడి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నారు అనే మినిమమ్ ఐడియా రావాల్సి ఉంది. సో ఏదన్నా ట్రైలర్ లేదా టీజర్ లాంటిది అయినా రావాల్సి ఉంది. సో వీటిని ఎప్పుడు వదులుతారో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.


