బాలయ్య సినిమాకు మిస్టరీ ఎప్పుడు వీడుతుందో.?

Published on Mar 18, 2021 2:00 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనెర్ కోసం నందమూరి అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో తెలిసిందే. మరి అలాగే ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాకు వేసవిలో విడుదల కూడా కన్ఫర్మ్ అయ్యిపోయింది. కానీ ఇప్పటికీ మాత్రం ఓ మిస్టరీ అలా కొనసాగుతూనే ఉంది.

అదే ఈ చిత్రం తాలూకా టైటిల్ పైనే..ఇప్పటికే అనేక పవర్ ఫుల్ టైటిల్స్ పరిశీలనలోకి వచ్చినా వాటిలో ఇంకా ఏది కన్ఫర్మ్ అయ్యింది అన్నది తెలియరాలేదు. దీనితో ఈ మాస్ కాంబో స్టాండర్డ్స్ ను మ్యాచ్ చేసే టైటిల్ కోసం ఇంకా బెటర్ ఛాయిస్ ల కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు కావచ్చు. మరి ఈ ఇంట్రెస్టింగ్ మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వాయు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :