రెబల్ స్టార్ స్ట్రామ్ ఎక్కడ ఆగుతుందో.?

Published on Oct 18, 2020 12:11 pm IST

మన టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్ హీరో. ఒకప్పుడు ప్రభాస్ పాన్ ఇండియన్ సినిమాలో చేసాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ ఒక మామూలు డైరెక్టర్ తో ప్రాజెక్ట్ టేకప్ చేస్తే అది పాన్ ఇండియన్ సినిమా అవుతుంది. మరి అలాంటి ప్రభాస్ క్రేజ్ ఇతర రాష్ట్రాల్లో కంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ముందు నుంచీ భారీ స్థాయిలో ఉంది. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ టేకప్ చేసిన మరో భారీ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ “సాహో”.

యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ లెవెల్ ప్రామాణికాలతో తెరకెక్కించాడు. అయితే బాక్సాఫీస్ ఫలితం అనే మాట పక్కన పెడితే ప్లాప్ టాక్ తో కూడా ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మన తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. కానీ నిరాశనే మిగిల్చింది. అయితే ఈ భారీ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ కోసం మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

ఇప్పుడు ఈ చిత్రం రోజు జీ తెలుగు ఛానెల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామెన్స్ కి సంబంధం లేకుండా స్మాల్ స్క్రీన్ దగ్గర సూపర్బ్ గా పెర్ఫామ్ చేసిన చిత్రాలు చాలానే ఉన్నాయి. దీనితో రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన ఈ సాహో స్ట్రామ్ ఎక్కడ ఆగుతుందో అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరి ఈ చిత్రం ఎలాంటి టీఆర్పీను సెట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More