రౌడీ హీరో నుంచి క్లారిటీ ఏది.?

రౌడీ హీరో నుంచి క్లారిటీ ఏది.?

Published on Nov 7, 2020 7:03 AM IST

Vijay Deverakonda 2

హీరోగా తెరంగేట్రం చేసిన ఆనతి కాలంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకొన్నాడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. తనదైన యాటిట్యూడ్ తో టాలీవుడ్ లో మంచి బెంచ్ మార్క్ ను సెట్ చేసుకోడమే కాకుండా ఇప్పుడున్న యూత్ లో మంచి ఫాలోయింగ్ ను రాబట్టుకున్నాడు.

అలా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేసే వరకు వెళ్లగలిగాడు. అయితే ఇప్పుడు మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో ఓ యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ ఏడాది లాక్ డౌన్ మూలాన అన్ని సినిమాల్లానే ఈ సినిమా షూట్ కూడా వాయిదా పడింది.

కానీ మిగతా బడా సినిమాలు అన్నీ షూట్ ను మొదలు పెట్టేశాయి. ఇంకా మరికొన్ని రేస్ లో ఉన్నాయి. కానీ విజయ్ చేస్తున్న ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కు సంబంధించి మాత్రం ఎలాంటి మూమెంట్ కనిపించడం లేదు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుందో చూడాలి. ఈ చిత్రానికి బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా భాగంగా ఉన్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు