ఇంటర్వ్యూ : ఎం. శ్రీధర్‌ రెడ్డి – నిర్మతగా మారడానికి దిల్ రాజు గారే నాకు ప్రేరణ !

Published on Mar 12, 2019 2:49 pm IST

నూతన దర్శకుడు కిషోర్ కుమార్ దర్శకత్వంలో హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రగా రాబోతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి సమర్పణలో ఏబీటీ క్రియేషన్స్‌ పతాకంపై ఎం. శ్రీధర్‌ రెడ్డి, హెచ్‌. ఆనంద్‌ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మించిన ఈ సినిమా మార్చి 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎం. శ్రీధర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

మీ గురించి చెప్పండి ?

మాది అనంతపురం అండి. నేను ఇంజనీరింగ్ చదివాను. కొన్నాళ్ళు సాఫ్ట్ వేర్ గా కూడా వర్క్ చేశాను. ఆ తరువాత బిజినెస్ చేస్తూనే.. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఈ సినిమా చేస్తున్నాను.

మీకసలు ప్రొడక్షన్ మీద ఎప్పుడు ఆసక్తి కలిగింది. ప్రొడ్యూసర్ అవ్వాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు ?

నేను నిర్మతగా మారడానికి దిల్ రాజు గారే నాకు ప్రేరణ. నేను ఇంజనీరింగ్ చదువుకున్నే రోజులు నుంచీ ఆయన గురించి తెలుసుకుంటూ ఉన్నాను. ఆయన సినిమాలు తీసే విధానం నచ్చే.. నాకూ ప్రొడక్షన్ అంటే ఇంట్రస్ట్ కలిగింది.

దిల్ రాజు గారే ప్రేరణ అంటున్నారు. ఆయనేమో ఫ్యామిలీ సినిమాలు చేస్తుంటే.. మరి మీరు ఎందుకు హర్రర్ మూవీ చేస్తున్నారు ?

‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి’ మొత్తం హర్రర్ మూవీ కాదు అండి. సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ కొంత భాగమే ఉంటుంది. ఈ సినిమా ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు.

అసలు ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ సినిమా ఎలా మొదలైంది ?

రచయిత తటవర్తి కిరణ్‌ ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి’ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఆయనే ఈ సినిమా దర్శకుడు కిషోర్‌ కుమార్‌ తీసుకొచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఇది తొలి సినిమా అయినా ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా తీశాము.

‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’లో రాయ్ లక్ష్మీనే తీసుకోవడానికి గల కారణాలు ఏమిటి ?

మొదట వేరే కొంతమంది హీరోయిన్స్ ను అనుకున్నారు. కానీ వెంకటలక్ష్మి’ పాత్రలో రాయ్ లక్ష్మీ అయితేనే న్యాయం జరుగుతుందని.. నేనే ఆమెను హీరోయిన్ గా ఎంచుకోవడం జరిగింది. ఇప్పటివరకూ రాయ్ లక్ష్మీకు తెలుగులో ఆమెకు తగ్గ పాత్రలను ఎవ్వరూ ఇవ్వలేదు. ఈ సినిమాలో రాయ్ లక్ష్మీ మంచి పాత్రను చేశారు.

ఈ సినిమా గురించి చెప్పండి ?

గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో వెంకటలక్ష్మి అనే చిన్నపిల్లల టీచర్‌ చుట్టూ కథ జరుగుతుంది. సినిమాలో ప్రధానంగా కామెడీ, హ్యూమర్‌తో పాటు థ్రిల్లింగ్‌ అంశాలు ఉంటాయి, అలాగే వినోదంతో పాటు సస్పెన్స్‌ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

మీ తదుపరి చిత్రాలు గురించి చెప్పండి ? ఎవరితో చేస్తున్నారు ?

పెద్దవాళ్ళతోనే చెయ్యాలని ఉంది. రెండు మూడు కథలు కూడా ఉన్నాయి. అయితే ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి రిలీజ్ తరువాతే ఏది చెయ్యాలో ఎవరితో ఫైనల్ చేస్తాం. సినిమాలైట్ కంటిన్యూగా చేస్తాము.

సంబంధిత సమాచారం :

X
More