
‘కథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శ్రీనివాస్ రాఘ. ఆయన చేసిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమానే ‘వేర్ ఈజ్ విద్యాబాలన్.?’. బస్ స్టాప్, రొమాన్స్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో ప్రిన్స్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా జ్యోతిసేతి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికేట్ తెచ్చుకుంది.
అన్ని కార్యక్రమాలు పూర్తవ్వడంతో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ఓ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు. ఈ చిత్ర టీం వేర్ ఈజ్ విద్యాబాలన్.? సినిమాని జూన్ 26న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. ఎల్.వేణుగోపాల్ రెడ్డి, పి.లక్ష్మీనరసింహారెడ్డి, ఆలూరి చిరంజీవి కలిసి నిర్మించిన ఈ సినిమాలో సంపూర్నేష్ బాబు, సప్తగిరి, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో సన్నీ లియోన్ పేరు పై చేసిన సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని ఈ చిత్ర టీం అంటోంది.

