ఈ వారం రిలీజయ్యే రెండు ప్రేమకథా చిత్రాల్లో ఏది బాగుంటుంది ?

ఈ వారం రిలీజయ్యే రెండు ప్రేమకథా చిత్రాల్లో ఏది బాగుంటుంది ?

Published on Jun 11, 2018 11:00 PM IST

Naa Sammohanam

ఈ వారం ప్రేక్షకుల ముందుకు రెండు చిత్రాలు పోటాపోటీగా రాబోతున్నాయి. ఒకటి కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’చిత్రం, రెండు సుధీర్ బాబు ‘సమ్మోహనం’చిత్రం. ఈ ఇద్దరి హీరోల కెరీర్ కు ఈ చిత్రాలు చాలా కీలకం కానున్నాయి. ప్రేక్షకుల్లో కూడా రెండు చిత్రాల మీద మంచి అంచనాలే ఉన్నాయి.

కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో మొదటిసారి చేస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘నా నువ్వే’ చిత్రం. ముఖ్యంగా ‘తమన్నా, కళ్యాణ్ రామ్’ మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరించనున్నాయట. పిసి శ్రీరామ్ తీసిన అద్భుతమైన విజువల్స్, జయేంద్ర దర్శకత్వం ఈ ‘నా నువ్వే’ చిత్రాన్ని విజయతీరాలకు చేర్చుతుందని చిత్రబృందం గట్టిగా నమ్ముతుంది.

అలాగే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు కూడా మొదటిసారి చేస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సమ్మోహనం’ చిత్రం. అదితి రావ్ హైదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సినిమా నేపథ్యంలో సాగుతుంది. ‘జెంటిల్ మెన్, అమీ తుమీ’ లాంటి సినిమాలతో సక్సెస్ ట్రాక్ లో ఉన్న ఇంద్రగంటి దర్శకత్వం వహించడం, మంచి అభిరుచి గల నిర్మాత అని పేరు ఉన్న శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించడం, సుధీర్ బాబు, అదితి రావ్ నటన వంటివి ఈ చిత్రానికి ప్రధాన బలాలు.

ఈ రెండు చిత్రాలు కూడా భావోద్వేగంతో నిండిన ప్రేమ ప్రధానంశంగా తెరకెక్కాయి. మరీ ఒకే అంశంతో ఒక్క రోజు తేడాతో బరిలోకి దిగుతున్న ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రం విజయం సాధిస్తుందో చూడాలి.

తాజా వార్తలు