నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల ప్రాజెక్ట్ ఇటీవలే లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయకిగా బాలీవుడ్ స్టార్ నటి సొనాక్షి సిన్హాను తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. ఈ వార్తలు బాగా వైరల్ అయి సొనాక్షి వరకు వెళ్లాయి. దీంతో ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బాలకృష్ణ చేయబోయే సినిమాలో నేను నటిస్తాననే వార్తలొస్తున్నాయి. వీటిపై క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను అంటూ ఆ న్యూస్ నిజం కాదని, తాను చేయబోయే తర్వాతి సినిమాను త్వరలోనే అనౌన్స్ చేస్తానని చెప్పుకొచ్చింది.
దీంతో ఇంతకీ బాలయ్యకు జోడీ ఎవరనే విషయంపై మళ్లీ చర్చ మొదలైంది. మరి బాలయ్య సరసన బోయపాటి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. ఇప్పటికే శ్రద్ధ శ్రీనాథ్ ను తీసుకోనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త నిజం అవుతుందేమో చూడాలి. ఇక ఇంతకుముందు బాలయ్య – బోయపాటి కలయికలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే, వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే. మరి ప్లాప్ ల్లో ఉన్న ఈ హిట్ కాంబినేషన్ హిట్ కొడుతుందా ? చూడాలి.


