ఈసారి బిగ్ బాస్ నుండి ఆ ముగ్గురి నుండి ఒకరు అవుట్.

Published on Aug 17, 2019 8:04 pm IST

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో విజయవంతంగా నాలుగో వారానికి చేరుకుంది. జులై 21న బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన 15మంది సభ్యులలో నటి హేమ, రిపోర్టర్ జాఫర్ ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లిపోగా, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశించిన ట్రాన్స్ జెండర్ తమన్నా కూడా గత వారం బిగ్ బాస్ హౌస్ కి బై బై చెప్పారు. కాగా ఈ వారం ఎలిమినేషన్ కి గాను, ఏడుగురు సభ్యులు ఎంపిక కాబడ్డారు. వారిలో శ్రీముఖి,వరుణ్ సందేశ్,బాబా భాస్కర్,రాహుల్,శివ జ్యోతి,రోహిణి, మరియు రవి కృష్ణ ఉన్నారు.

ఐతే ఇప్పటికే అందుతున్న ఉహాగానాల ప్రకారం వీరిలో శివ జ్యోతి, రోహిణి, రాహుల్ తక్కువ ఓట్లు పొందారని వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదని చెవుతున్నారు. ఈ ముగ్గురిలో కూడా సీరియల్ నటి రోహిణి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయట. మరి చూడాలి బిగ్ బాస్ ఈవారం ఎవరిని బట్టలు సర్దుకో మంటాడో.

సంబంధిత సమాచారం :