బిగ్ బాస్ టైటిల్ విన్నర్…?

బిగ్ బాస్ టైటిల్ విన్నర్…?

Published on Nov 3, 2019 10:59 AM IST

big boss

పదిహేడు మంది కంటెస్టెంట్స్ వందరోజులు పైగా నడిచిన షో చివరి ఘట్టానికి చేరుకుంది. ఇంకొద్ది గంటల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇన్నిరోజుల ఉత్కంఠకు తెరదించుతూ ప్రజల అభిమానం గెలిచిన ఆ ఇంటి సభ్యుడు ఎవరు అనేది తేలిపోనుంది. ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో కలిపి మొత్తం 17మంది బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ గా ఐదుగురు మిగిలారు. వారిలో ఒకరు శ్రీముఖి కాగా, రాహుల్, వరుణ్, బాబా భాస్కర్, అలీ రేజాలు ఉన్నారు. మరి వీరిలో టాప్ టూ గా నిలిచేది ఎవరు? టైటిల్ విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? ఇలా అనేక ప్రశ్నలు ప్రేక్షకుల మదిని తొలిచేస్తున్నాయి.

ఇక విన్నర్ గా నిలిచేది రాహుల్ లేదా శ్రీముఖి లలో ఒకరని ఇప్పటికే అందుతున్న వార్త. కేవలం ప్రేక్షకుల ఆన్లైన్ ఓటింగ్ ద్వారా విజేత ఎంపిక కాబడే నేపథ్యంలో రాహుల్, శ్రీముఖిలు మిగతా వారి కంటే అధిక ఓట్లు సంపాదించినట్లు తెలుస్తుంది. వీరిద్దరిలో కూడా రాహుల్ కే ప్రేక్షకులు పట్టం కట్టారని, శ్రీముఖి రన్నర్ అప్ టైటిల్ తో సరిపెట్టుకోవాల్సిందే అని టాక్. మరి ఈ ఉహాగానాలలో నిజమెంతో, అసలు టైటిల్ అందుకోబోయేది ఎవరో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఓపిక పట్టాల్సిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు