‘సాహో’ తర్వాత ప్రభాస్ ను డైరెక్ట్ చేసేది ఇతనేనా ?

30th, June 2017 - 01:01:44 PM


‘బాహుబలి’ సక్సెస్ తర్వాత జాతీయ స్థాయి స్టార్ హీరోల్లో ఒకరిగా మారిపోయిన ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్లో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. టీజర్ తోనే ఆకట్టుకున్న ప్రాజెక్ట్ బాహుబలి తరువాత ప్రభాస్ కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా కావడం విశేషం. ఈ సినిమా ఆరంభ దశలో ఉండగానే ప్రభాస్ యొక్క తర్వాతి సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. ఆసక్తికరమైన వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం నటుడు, దర్శకుడు ఆయన ప్రభుదేవా ప్రభాస్ తర్వాతి సినిమాను చేయనున్నారట. చాలా కాలంగా ప్రభాస్ తో వర్క్ చేయాలనుకుంటున్నానని, సాహో తర్వాత చేస్తానని ప్రభుదేవా స్వయంగా చెప్పారట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవముందో తెలియలాంటే కొంతకాలం ఎదురుచూడక తప్పదు. ఇకపోతే ప్రభుదేవా గతంలో ప్రభాస్ తో ‘పౌర్ణమి’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.