నేడు బిగ్ బాస్ నుండి వెళ్లిపోయేది ఎవరంటే…?

Published on Oct 6, 2019 12:05 pm IST

మరొక వారాంతాని బిగ్ బాస్ షో చేరుకుంది. వారాంతం వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్ నుండి ఒకరు సొంత హౌస్ కి వెళ్లడానికి సమయం వచ్చిందని అర్థం. బిగ్ బాస్ షో చివరి దశకు చేరడంతో ఎలిమినేషన్ విషయంలో అటు ప్రేక్షకులతో పాటు, ఇటు ఇంటి సభ్యులకు ఆసక్తిపెరిగిపోయింది. ఇక ఎలిమినేషన్ కొరకు నామినేట్ అయిన వారి సంగతి సరేసరి. టెన్షన్ తో వారు అల్లాడిపోవడం ఖాయం. ఈ వారం ఎలిమినేషన్ కొరకు నలుగురు ఎంపిక కావడం జరిగింది. రాహుల్ నిన్న సేఫ్ జోన్ లో ఉన్నట్లు నాగార్జున ప్రకటించడంతో ఆయన ఎలిమినేషన్ నుండి బయటపడ్డారు.

ఇక మిగిలింది ముగ్గరు, వరుణ్, మహేష్, పునర్నవి. వీరిలో ఫ్యాన్ బేస్ ఉండటంతో పాటు గేమ్ విషయంలో కూడా మంచి ప్రదర్శన కలిగిన వరుణ్ సేఫ్ అవ్వడం ఖాయం. ఇక మిగిలిన మహేష్, పునర్నవి నుండి ఒకరు ఎలిమినేట్ అవుతారు అనడంలో సందేహం లేదు. కానీ రెండు రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం ప్రకారం ఈవారం పునర్నవి షో కి బై చెప్పే అవకాశం కలదని వినికిడి. ఐతే ఇది కేవలం అంచనా మాత్రమే, ఏదైనా జరగొచ్చనే సూత్రాన్ని పాటించే బిగ్ బాస్ షోలో ఏమి జరుగుతుందో ఊహించడం కష్టం.

సంబంధిత సమాచారం :

More