
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ చాలా సార్లు తన డ్రీం ప్రాజెక్ట్ ‘మర్మయోగి'(తమిళ్ లో ‘మరుధనాయగన్’) అని చెప్పారు. ఈ సినిమా 1997 అక్టోబర్ లో ప్రారంభమైంది. కొంత వరకూ షూటింగ్ కూడా చేసారు. కానీ మధ్యలో బడ్జెట్ సమస్య రావడంతో ఈ సినిమాని ఆపేశారు. అప్పటి నుంచి అలాగే ఉన్న ఈ సినిమాకి సంబందించిన కొన్ని సీన్స్ కూడా యు ట్యూబ్ లో ఉన్నాయి. వాటికి మంచి రెస్పాన్స్ కూడా ఉంది.
అప్పట్లోనే ఈ సినిమాకి 50 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. అదే సినిమాని ఇప్పుడు తీయాలంటే దానికి డబుల్ అయ్యే చాన్స్ ఉంది. ఈ సినిమాని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారా అని కమల్ ని అడిగితే ప్రస్తుతానికి ఈ సినిమా బడ్జెట్ దృష్ట్యా ఏ నిర్మాత కూడా ముందుకు రావటం లేదని అన్నాడు.
కానీ తాజా సమాచారం ప్రకారం కమల్ హాసన్ విశ్వరూపం చూసిన హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చిందని అంటున్నారు. దీని ప్రకారం త్వరలో ఈ సినిమా మళ్ళీ తిరిగి ప్రారంభం కావాలని కోరుకుందాం.