బిగ్ బాస్ 2 టైటిల్ గెలిచేదెవరు ?

Published on Sep 29, 2018 12:54 pm IST

స్టార్ హీరో నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 2కి ఈ ఆదివారంతో తెరపడనుంది. ఇక ఈ టైటిల్ ఎవరు గెలుస్తారో అనే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బిగ్ బాస్ ప్రేమికులు. వోటింగ్ కూడా క్లోజ్ అయిన్నట్లు సమాచారం. ప్రస్తుతం హౌస్ లో 5గురు కంటెస్టెంట్లు మాత్రమే టైటిల్ భరిలో నిలిచారు. వారిలో కౌశల్,గీతా మాధురి , సామ్రాట్ , దీప్తి మరియు తనీష్ వున్నారు.

అయితే టైటిల్ పోరు మాత్రం ప్రధానంగా కౌశల్ , గీతా మాధురి, దీప్తి ల మధ్యనే ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ సీజన్ లో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నకంటెస్టెంట్ కౌశల్ ఈ సీజన్ విజేతగా నిలుస్తాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి ఎవరు టైటిల్ గెలుస్తారో రేపు తెలిసిపోనుంది. ఇక ఒక సీనియర్ స్టార్ హీరో ఈ ఫైనల్ కు ముఖ్య అతిధిగా వస్తారని సమాచారం. టైటిల్ కూడా ఆయనే విజేతకు అందజేయనున్నాడు.

సంబంధిత సమాచారం :