డిస్కో రాజా ఎందుకు వెనక్కి తగ్గినట్టు

Published on Nov 8, 2019 12:00 pm IST

నిన్న హీరో రవితేజ తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. తన లేటెస్ట్ మూవీ డిస్కో రాజా చిత్రాన్ని ఏకంగా నెల వెనక్కి వాయిదా వేసి వారిని నిరుస్తాహపరిచాడు.గతంలో డిస్కో రాజా మూవీ విడుదల తేదీ డిసెంబర్ 20గా నిర్ణయించడం జరిగింది. కాగా ఇప్పుడు డిస్కో రాజా మూవీ వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అసలు డిస్కో రాజా విడుదల వాయిదా వెనుక అసలు కారణాలు గమనిస్తే పోటీ అని తెలుస్తుంది. సాయి ధరమ్ తేజ్,దర్శకుడు మారుతీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతి రోజు పండుగే చిత్రంతో పాటు, బాలకృష్ణ నటించిన రూలర్ మూవీ కూడా అదే రోజున విడుదల అవనున్నట్లు ప్రకటించారు.

నిజానికి డిసెంబర్ 20 తేదీని అందరికంటే ముందు రవితేజానే ప్రకటించడం జరిగింది. ఆ తరువాత బాలకృష్ణ రూలర్ మరియు ప్రతిరోజు పండుగే చిత్రాల విడుదల తేదీగా డిసెంబర్ 20ని నిర్ణయించారు. పోటీకారణంగానే డిస్కో రాజా మూవీని విడుదల జనవరి మార్చినట్టు తెలుస్తుంది. ఇక సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 తెలుగు వర్షన్ కూడా అదే రోజు విడుదల కావడం విశేషం.

సంబంధిత సమాచారం :

X
More