నయనతార పెళ్లికి అడ్డు ఏంటీ?

Published on Aug 5, 2020 11:42 am IST

సౌత్ ఇండియన్ స్టార్ గా నయనతార కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఓ ప్రక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే మరో ప్రక్క స్టార్ హీరోల సరసన జతకడుతుంది. గత ఏడాది విడుదలైన విజయ్ బ్లాక్ బస్టర్ మూవీ బిగిల్ లో ఆమె హీరోయిన్ గా నటించింది. అలాగే రజిని-మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన దర్బార్ మూవీలో కూడా నయనతార హీరోయిన్ గా నటించడం విశేషం. ప్రొఫెషన్ లైఫ్ లో సూపర్ సక్సెస్ అయిన నయన పర్సనల్ లైఫ్ లో మాత్రం కొన్ని ఒడిదుడులు ఎదుర్కొంది.

హీరో శింబు మరియు ప్రభుదేవాలతో లవ్ అండ్ బ్రేక్ అప్ తరువాత దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు. దాదాపు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లి అనే మాట ఎత్తడం లేదు. అదిగో పెళ్లి, ఇదిగో పెళ్లి అని వార్తలు వస్తున్నప్పటికీ ఈ జంట మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. కోలీవుడ్ లో మాత్రం నయన- విగ్నేష్ ఎందుకు పెళ్లి మాట ఎత్తడం లేదనే చర్చ నడుస్తుంది. వీరి పెళ్ళికి అడ్డు వస్తున్న అంశం ఏమిటనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.

సంబంధిత సమాచారం :

More