ఈ హీరోయిన్ కి అవకాశాలు ఎందుకు రావట్లేదో ?

ఈ హీరోయిన్ కి అవకాశాలు ఎందుకు రావట్లేదో ?

Published on Mar 29, 2020 10:30 PM IST

మజిలీ సినిమాలో క్రికెటర్ చైతుకు జోడిగా నటించి మెప్పించిన సెకెండ్ హీరోయిన్ ‘దివ్యాంశ కౌశిక్’ గుర్తుంది కదా. నార్త్ ఇండియన్ అమ్మాయిగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ ఆకట్టుకుంది ఈ అమ్మడు. కానీ మజిలీలో హీరోయిన్ గా క్రెడిట్ మొత్తం సమంతకే వెళ్ళిపోయింది. దాంతో దివ్యాంశకు రావాల్సిన స్థాయిలో పేరు రాకపోవడంతో ఆమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ కూడా రాలేదు. మజిలీ టీం మొత్తం వరుసగా సినిమాలు చేస్తూ తమ తరువాత సినిమాల పై దృష్టి పెడితే.. ఈ భామ మాత్రం పెద్ద సినిమా ఆఫర్ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది.

మజిలీలో తన పాత్రలో అద్భుతంగా నటించినా ఛాన్స్ లు ఎందుకు రావట్లేదో… మొత్తానికి దివ్యంశ కౌశిక్ పరిస్థితి.. సినిమా భారీ హిట్.. తాను మాత్రం ఫట్ మాదిరిగా తయారయింది. ఒకపక్క సరైన వరుస హిట్స్ లేని నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు సైతం మంచి ఆఫర్స్ పట్టుకుంటుంటే.. హిట్ సినిమాలో మెయిన్ లీడ్ గా చేసి కూడా దివ్యంశ కౌశిక్ ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు