కొమరం భీమ్ ని కష్టపెడుతూ అల్లూరిని వదిలేసిన రాజమౌళి

Published on Dec 19, 2019 1:26 pm IST

బాహుబలి లాంటి ఆల్ టైం ఇండియన్ హిట్ తరువాత రాజమౌళి చేస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కొమరం భీం, అల్లూరి సీతారాములుగా నటిస్తున్నారు. పీరియాడిక్ కథకు కాల్పనికత జోడించి రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ షెడ్యూల్ ప్రస్తుతం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతుంది. కొమరం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ పై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరి వైజాగ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ కష్టపడుతుండగా…అల్లూరి పాత్ర చేస్తున్న చరణ్ వివిధ వేడుకలో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ చిత్ర షెడ్యూల్ విశాఖలో ప్రారంభమైన సమయంలో ఓ అవార్డు వేడుకలో పాల్గొనడానికి చెన్నై వెళ్లారు. వచ్చిన వెంటనే రామ్ చరణ్ షూట్ లో పాల్గొంటారు అనుకున్నారందరూ. కానీ చరణ్ వైజాగ్ వెళ్ళలేదు. నిన్న రాత్రి సల్మాన్, వెంకటేష్ లతో కలిసి దబాంగ్ ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేశారు. కాబట్టి వైజాగ్ షెడ్యూల్ నందు చరణ్ పాల్గొనవలసిన అవసరం లేదా..? లేక ఆయన తరువాత జాయిన్ అవుతారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే చరణ్ తన పాత్రకు సంబంధించి చాలా షూటింగ్ పూర్తి చేసినట్లుగా కూడా ఒక వార్త వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :