రకుల్ ప్రీత్ సైకోనా?

Rakul-Preet-singh
రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగులో పాగా వేసిన హీరోయిన్. ఆ సినిమాలో తన అందంతో, నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే ‘లౌక్యం’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న రకుల్‌కు అవకాశాలు క్యూ కట్టాయి. తాజాగా రవితేజ ‘కిక్ 2’, రామ్ ‘పండగ చేస్కో’, రామ్ చరణ్ – శ్రీనువైట్లల సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న రకుల్, త్వరలోనే ఎన్టీఆర్ సినిమాలోనూ నటించేందుకు సిద్ధమైంది.

వరుస సినిమాలతో బిజీగా ఉండడం పట్ల రకుల్ ఆనందం వ్యక్తం చేసింది. ఒకేసారి ఇన్ని సినిమాల్లో నటించడం కష్టంగా లేదా? అన్న ప్రశ్నకు, తనకు అది అలవాటైపోయిందని చెప్పుకొచ్చింది. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ వ్యాయామం మాత్రం తప్పకుండా చేస్తానంటుంది. వారానికి కనీసం ఐదు రోజులు వ్యాయామం చేయకుండా ఉండలేనని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తన కమిట్‌మెంట్ చూసి ఫ్రెండ్స్ అందరూ తనను సైకో అని కూడా అంటారని నవ్వుతూ చెప్తోంది రకుల్.

Exit mobile version