బాహుబలి టీమ్ లో ఆమె మిస్సైయ్యిందేంటి…?

బాహుబలి టీమ్ లో ఆమె మిస్సైయ్యిందేంటి…?

Published on Oct 19, 2019 12:25 PM IST


లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ థియేటర్ లో నేడు బాహుబలి ది బిగినింగ్ మూవీని ప్రదర్శించనున్నారు. దీనితో కొద్దిరోజుల క్రితమే బాహుబలి టీం లండన్ చేరుకోవడం జరిగింది. హీరో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, దర్శకదీరుడు రాజమౌళి నిర్మాత శోభు యార్లగడ్డ ప్రస్తుతం లండన్ ఉన్నారు. చారిత్రాత్మక రాయల్ ఆల్బర్ట్ స్టేడియంలో మూవీ ప్రదర్శించడం అంటే అదో పెద్ద గౌరవంగా భావిస్తారు. ఈ ఏడాదికిగాను ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ ప్రదర్శనకు మూడు చిత్రాలు ఎంపిక కాగా, వాటిలో బాహుబలి బిగినింగ్ ఒకటి. మిగతావి స్కై ఫాల్ మరియు హ్యారి పోటర్.

ఐతే లండన్ వెళ్లిన బాహుబలి టీంలో తమన్నా లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బాహుబలి దర్శక నిర్మాతలతో పాటు,ప్రభాస్, అనుష్క, రానా వెళ్లగా, తమన్నా మాత్రం వెళ్లినట్లు అనిపించడం లేదు. నిజానికి బాహుబలి బిగినింగ్ మూవీలో అనుష్క పాత్రేమీ ఉండదు. తమన్నా కు మాత్రమే ఆ చిత్రంలో పూర్తి నిడివి కలదు. అలాంటిది తమన్నా ఈ ఈవెంట్ లో కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.తెలుగు తమిళ మరియు హిందీ చిత్రాలతో బిజీ గా ఉన్న తమన్నా షూటింగ్ షెడ్యూల్స్ వలన వెళ్లలేకపోయారేమో. లేక వారితో తరువాత జాయిన్ అవుతారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు