
దశాబ్దన్నర కాలంగా తెలుగు, తమిళ భాషలలో అగ్ర హీరోయిన్ గా ప్రేక్షకులను అలరిస్తున్న త్రిష, 50 సినిమాల మైలురాయిని చేరుకుంది. దాదాపుగా అన్ని రకాల పాత్రలలో, సినిమాలో నటించి మెప్పించింది. కానీ, ఇప్పటివరకు ఒక్క హారర్ సినిమాలో కూడా కనిపించలేదు. తోటి హీరోయిన్లు హన్సిక, అనుష్క, ఛార్మి, అంజలి, రాయ్ లక్ష్మి, ప్రియమణి తదితరులు హారర్ సినిమాలలో నటించి సక్సెస్ అందుకున్నారు. ఇటివల హారర్ జోనర్లో వచ్చిన ‘గీతాంజలి’, ‘ప్రేమ కథా చిత్రమ్’, ‘చంద్రకళ’ వంటి సినిమాలు విజయం సాధించాయి. అయినా, ఈ చెన్నై సుందరి హారర్ సినిమాల వైపు కన్నెత్తి చూడలేదు. దీనికి కారణం, త్రిషకు హారర్ సినిమాలంటే ఇష్టం లేదట.
ఇటివల ఓ దర్శకుడు త్రిషను కలిసి హారర్ స్క్రిప్ట్ వినిపించబోగా సున్నితంగా తిరస్కరించిందట. ఆమెకు దెయ్యం సినిమాలంటే ఇష్టం లేదని, కనీసం అటువంటి సినిమా కథలు కూడా వినదని సన్నిహిత మిత్రులు చెప్పారు. అందువల్ల, ప్రేక్షకులు అందాల త్రిష నుండి అందరిని భయపెట్టే సినిమా ఆశించడం మానుకోండి.

