ఓటీటీలోకి సీనియర్ స్టార్ హీరో సినిమా

Published on Nov 26, 2020 10:15 pm IST

సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగర్జున చేస్తున్న కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇందులో నాగ్ ఎన్.ఐ.ఎ అధికారిగా కనిపించనున్నారు. ఈ చిత్రం ఈమధ్య కాలంలో నాగర్జున చేసిన సినిమాలకు భిన్నంగా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్. ఈమధ్యే హిమాలయాల్లో షూటింగ్ రీస్టార్ట్ చేసి షెడ్యూల్ ముగించారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ నుండి సినిమాకు పెద్ద మొత్తంలో ఆఫర్లు వస్తున్నాయట.

ఒకవేళ నిర్మాతలు గనుక ఓటీటీకి ఓకే చెబితే ‘వి, ఆకాశం నీ హద్దురా !’ లాంటి సినిమాల తర్వాత ఓటీటీలో రాబోయే పెద్ద తెలుగు సినిమా ఇదే అవుతుంది. పైగా ఓటీటీకి ఓటేసిన పెద్ద తెలుగు హీరో నాగర్జునే అవుతారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీలు సయామీ ఖేర్, దియా మీర్జాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More