పుష్ప “దాక్కో దాక్కో మేక” కి కొనసాగుతున్న వైల్డ్ రెస్పాన్స్…20 మిలియన్ కి పైగా వ్యూస్!

Published on Aug 20, 2021 8:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ చిత్రం నుండి ఆగస్ట్ 13 వ తేదీన ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కొ మేక సాంగ్ విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాట ఇప్పటి వరకూ 20 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించడం జరిగింది. అంతేకాక 860కే ప్లస్ లైక్స్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఈ పాట కి 61కే మందికి పైగా కామెంట్స్ చేయడం జరిగింది. ఐదు బాషల్లో కూడా ఈ పాట తన వైల్డ్ రెస్పాన్స్ ను కొనసాగిస్తూనే ఉంది.

ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రం కావడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడం, ఈ సినిమా కి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో అల్లు అర్జున్ మునుపెన్నడూ లేని విధంగా ఊర మాస్ గెటప్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం లో రష్మీక మందన్న అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :