భారీ బయోపిక్ ఓటిటీలో రిలీజ్ కానుందా ?

Published on Sep 27, 2020 1:05 am IST


బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రానున్న లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ విడుదల పై గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ అయితే వస్తున్నాయి కానీ, అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే క్లారిటీ మాత్రం లేదు. కాగా తాజాగా ఈ సినిమాని ఓటిటీలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని.. ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ నుండి ఈ బయోపిక్ కి భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.

కరోనా అనంతరం నేరుగా థియేటర్స్ లో రిలీజ్ చేసినా అప్పుడున్న పరిస్థితులను బట్టి సినిమా టాక్ ను బట్టే రెవిన్యూ ఉంటుంది కాబట్టి.. అదే అమెజాన్ అయితే ఎలాంటి టెన్సన్స్ లేకుండా భారీ మొత్తంలో డబ్బులు వస్తున్నపుడు ఎందుకు ఓటిటీలో రిలీజ్ చెయ్యకూడదు అని మేకర్స్ ఆలోచనలో పడినట్లు బాలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమా ఓటిటీలో రిలీజ్ అవుతుందేమో చూడాలి.

ఇక ఈ బయోపిక్ తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా తెలుగు ప్రేక్షుకుల ముందుకు రాబోతుండటంతో తెలుగులో కూడా ఈ బయోపిక్ పై మంచి క్రేజ్ ఉంది. కాగా ’83’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రంలో 1983లో ఇండియా వరల్డ్ కప్ ను గెలుచుకునే క్రమంలో ఎదురుకున్న ఇబ్బందులు ఏమిటనే కోణంలో సినిమా ఉండనుంది.

సంబంధిత సమాచారం :

More