చిరు సినిమా హీరోయిన్ లేకుండానా… యాక్సెప్ట్ చేశారా?

చిరు సినిమా హీరోయిన్ లేకుండానా… యాక్సెప్ట్ చేశారా?

Published on Apr 24, 2020 6:58 AM IST

కమ్ బ్యాక్ తరువాత వరుసగా సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఒక మూవీ సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ మూవీకి ప్రణాళికలు వేస్తున్నారు. ఆయన ముగ్గురు దర్శకులను తన నెక్స్ట్ మూవీ కొరకు లైన్ లో పెట్టారు. మెహర్ రమేష్, బాబీ మరియు సుజీత్ తో కథా చర్చలు జరిపినట్లు చెప్పడం జరిగింది. వీరిలో సుజీత్ కి ఆయన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించారు. ఆ స్క్రిప్ట్ పై ప్రస్తుతం సుజీత్ పని చేస్తున్నారు.

ఐతే లూసిఫర్ ఓ పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ కాగా హీరోగా మోహన్ లాల్ నటించారు. ఆ చిత్రంలో ఆయనది మిడిల్ ఏజ్ మెన్ రోల్. అలాగే ఆ పాత్రకు హీరోయిన్ ఉండదు. మరి అదే రోల్ ఇక్కడ చిరంజీవి చేస్తుండగా ఆయన సరసన హీరోయిన్ లేకుండా మూవీ వర్క్ అవుట్ అవుతుందా అనే ఆలోచన వస్తుంది. కథ సంగతి ఎలా ఉన్నా… చిరంజీవి హీరో కాబట్టి హీరోయిన్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఈ విషయాన్ని సుజీత్ ఎలా మేనేజ్ చేస్తాడు అనేది ఆసక్తికరం. ఇక చిరుకి హీరోయిన్ లేకుండా ఐటమ్ సాంగ్స్ తో కొంత మేర ఆ లోటు పూడ్చే ఆలోచనలో సుజీత్ ఉన్నట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు