‘ఆటోనగర్ సూర్య’ అంచనాలను అందుకుంటుందా?

‘ఆటోనగర్ సూర్య’ అంచనాలను అందుకుంటుందా?

Published on Jun 26, 2014 11:54 PM IST

Autonagar-Surya-Latest-Post

దేవకట్టా తెరకెక్కించిన ‘ఆటోనగర్ సూర్య’ సినిమా రేపు విడుదలకానుంది. ఈ సినిమా చాలా కష్టాలను ఎదుర్కుని ఎట్టకేలకు రేపు థియేటర్లలో ప్రత్యక్షం కానుంది.

ఈ సినిమాలో తనకు నచ్చిన, తాను ఆచరించిన పలు సామాజిక అంశాలను తెరకెక్కించడానికి చాలా కష్టపడ్డాడు. తాను వార్తాపత్రికలో చదివిన ఒక వ్యాసం తనని ఎంతగానో కదిలించి ఈ సినిమా బీజానికి కారణమయ్యిందని ఇటీవలే దర్శకుడు తెలిపాడు. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్యని, 18నెలల బిడ్డని కొందరు పోలీసులు నిర్దాక్ష్యంగా బయటకు నెట్టేసిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు. ఈ సినిమాలో ఆ సంఘటన పెట్టకపోవడం గమనార్హం.

ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లు, డైలాగులు చూస్తున్న పక్షంలో ఈ సినిమా మనిషి వ్యక్తిగత బాధ్యతల మధ్య వ్యవస్థ నడిచే తీరు పట్ల చిత్రీకరించినట్లు అర్ధమవుతుంది. కాకపోతే సామాజిక స్పృహతో తీసిన చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయనే చెప్పాలి.

ఇటువంటి సబ్జెక్ట్ లకు కమర్షియల్ హంగులు అద్ది కేవలం శంకర్ మాత్రమే విజయం సాధించాడని చెప్పాలి. మరి దేవకట్టా ఈ పంధాలో అనుసరిస్తాడో లేదో చూడాలి.

మనం సినిమా తరువాత నాగచైతన్య నటన పై అందరి కళ్ళు వున్నాయి. సమంత హీరోయిన్ కావడం కలిసొచ్చే అంశం. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుందాం…

తాజా వార్తలు