సంపత్ నందితో బాలయ్య సినిమా.. నిజమేనా ?

సంపత్ నందితో బాలయ్య సినిమా.. నిజమేనా ?

Published on Feb 28, 2022 10:26 AM IST

డైరెక్టర్ సంపత్ నంది బాలయ్యతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్యకి సంపత్ నంది ఓ కథ చెప్పాడని బాలయ్య కథ నచ్చి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తాజాగా కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే నిర్మాత సి.కళ్యాణ్, బాలయ్య హీరోగా ఒక సినిమా చేయడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడు.

డైరెక్టర్ ‘సంపత్ నంది’ను బాలయ్య దగ్గరకు పంపింది మిర్యాల సి.కళ్యాణే అని టాక్ నడుస్తోంది. మరి బాలయ్య ఇమేజ్ కోసం సంపత్ నంది ఎలాంటి కథ రాశాడో చూడాలి. అన్నట్టు ఆ మధ్య సంపత్ నంది రవితేజతో సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, బాలయ్య అయితేనే తాను రాసుకున్న కథకు పూర్తి న్యాయం జరుగుతుందని సంపత్ నంది ఫీల్ అవుతున్నాడని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు