మహేష్ మూవీలో ఆయన కామెడీకి కట్టింగ్ పెడుతున్నారా..!

Published on Jan 19, 2020 1:00 am IST

మహేష్ సరిలేరు రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డ్స్ కలెక్షన్స్ రాబడుతుంది. నైజాంలో మొదటి వారం ముగిసే నాటికి 27.7 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం మొత్తంగా ఆంధ్ర మరియు తెలంగాణాలలో 85.56 కోట్ల షేర్ వసూలు చేసింది. కమర్షియల్ అంశాలతో మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. కాగా ఈ మూవీలో దాదాపు అరగంట ట్రైన్ కామెడీ ఎపిసోడ్ డిజైన్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ ఎపిసోడ్ నందు సంగీతం, రష్మిక, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ల కామెడీ బాగానే పేలింది. కోర్ కమెడియన్ గా చేసిన బండ్ల గణేష్ కామెడీ మాత్రం పేలలేదు. దీనితో బండ్ల గణేష్ సెవెన్ ఓ క్లాక్ కామెడీ ఎపిసోడ్స్ తీసివేసి, రావు రమేష్ తో కూడిన కొన్ని కామెడీ సన్నివేశాలు ఆ స్థానంలో పెడుతున్నారని సమాచారం.

కొత్త సన్నివేశాలు చిత్రానికి ఏర్పాటు చేయడం ఖచ్చితంగా సినిమాకు కలిసొస్తుంది. మహేష్ సరసన మొదటిసారి రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మించారు. దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీతం సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More