విడుదల అవుతుందిలే గానీ.. ఆడనిస్తారా ?

Published on Mar 26, 2019 12:55 am IST

ఎట్టకేలకూ మార్చి 29నే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల అవుతుంది. ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ చిత్రం కొన్ని సెన్సార్ ఇబ్బందులు ఎదుకున్నప్పటికీ చివరికి విడుదలకు సర్వం రంగం సిద్ధం చేసుకుంది.

అయితే ఈ చిత్రంలో చంద్రబాబును డైరెక్ట్ గా విలన్ గా చూపించడం.. పైగా సినిమాను ఎన్నికల సమయంలో విడుదల చేస్తుండటంతో ఈ సినిమాను ఎలాగైన అడ్డుకోవాలని తెలుగు తమ్ముళ్లు తెగ ప్రయత్నిస్తున్నారు.

మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకైతే నోచుకుంది గాని.. ఏపీలో ఈ సినిమాకు థియేటర్స్ దొరుకుతాయా ? ఒకవేళ దొరికినా సినిమాలో బాబు విలనిజం పీక్ లో ఉంటే మాత్రం తెలుగు తమ్ముళ్లు సినిమాను ఆడనిస్తారా ? ఏమో మరి.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను వర్మ ఎలా గట్టెక్కిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :